భారత విప్లవ నేత చారు మజుందార్ వర్ధంతి రోజైన జూలై 28 నుండి ఆగస్ట్ 3వ
తేదీవరకు సీపీఐ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అమరుల
సంస్మరణ వారాన్ని ప్రజలు విప్లవోత్సాహంతో జరుపుకుంటున్నారు.
ఏవోబీలో అమరుల సంస్మరణ వారోత్సవాలు విజయ వంతంగా జరుగుతున్నాయి. వారోత్సవాలతో మారుమూల గ్రామాల్లో మావోయిస్టు నేతలు, దళసభ్యులు అమరవీరుల స్తూపాల వద్ద ఎర్ర జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. సమీప గ్రామాల గిరిజనుల సమక్షంలో
అమరవీరులకు ఘనం గా నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ముంచంగిపుట్టు మండలం మారుమూల గ్రామాలకు సమీపంలోని ఒడిశా ప్రాంతంలో పలుచోట్ల రెండు రోజుల నుంచి మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. రెండో రోజైన ఆదివారం ఏవోబీలో కామైడ్స్ లత, జ్యోతి, శాంతి, లక్ష్మణ్ పేరుతో అమర వీరుల స్థూపాన్ని ఆవిష్కరించిన మావోయిస్టు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వేలాదిమంది ప్రజలతో బహిరంగ సభను నిర్వ హించారు. సుమారు 80మందికి పైగా మావోయిస్టులు ఈ సభ లో పాల్గొన్నట్టు సమాచారం. వారోత్సవాలకు సమీపంలోని ఒడిశా, విశాఖ ఏజెన్సీకి చెందిన గిరిజనులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమరవీరులకు నివాళులు, జోహర్లు అర్పిస్తు మావోయిస్టు దళ సభ్యులు పలు గీతాలు ఆల పించినట్టు తెలుస్తోంది. అలాగే ఒడిశాలోని కటాప్ ఏరియాలోని పలు చోట్ల కూడా అమరవీరుల స్తూపాలను మావోయిస్టులు అవిష్కరించారు. ఏవోబీలో మావోయిస్టులు అధికంగా సంచ రిస్తూ, అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుండ డంతో పోలీసు యంత్రాంగం హైఎలర్ట్ ప్రకటించింది.ఒడిశా పోలీసులతో కలసి, ఉమ్మడిగా కూంబింగ్ చేపట్టింది. పోలీసు పార్టీలు అధికంగా అడవిలో జల్లెడ పడుతున్నప్పటికీ ప్రజలు ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహిస్తూ అమరుల ఆశయాలను ఎత్తిపడుతున్నారు. తొలిరోజైన శనివారంనాడు కూడా పాడేరు ప్రాంతంలో అమరవీరుల సంస్మర ణ వారోత్సవాలను నిర్వహించి స్థూపాలను ఆవిష్కరించారు. భారీ బహిరంగ సభ నిర్వహించి పోలీసులకు సవాల్ విసిరారు. ఏవోబీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో తొలిరోజు నిర్వహించిన అమరవీరుల సంస్మరణ వారోత్స వాలకు సంబంధించిన ఫొటోలు శనివారం రాత్రి పాడేరులోని పత్రిక కార్యాలయాలకు అందాయి. సీలేరు ప్రాంతంలోఊరూరా ఎర్రటి బ్యానర్లు కట్టి, స్థూపా లకు ఎరుపురంగు పూసి చనిపోయిన వారి పేర్లను రాసి పేరు పేరున నివాళి అర్పించారు. ఏవోబీ సరిహద్దు కటాప్ ఏరియా లో మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించారు. వంద లాది మంది గిరిజనులు పాల్గొన్నారు. రామ్గూడ ఎన్కౌంటర్లో మరణించిన కామేడ్ లత, జ్యోతి, శాంతి, లక్ష్మణ్ ల స్మ్రుత్యర్దం స్తూపాలు ఆవిశ్కరించారు. ఈ వారోత్సవాలు అగ్రనే తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఒరిస్సా లోని రాయగడ జిల్లా నైమ గిరి పర్వతశ్రేణుల్లో మావోయిస్టుల బ్యానర్లు, వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రజల గురించి ప్రాణాలు ఇచ్చిన అమరుల బాటలో నడిచి సమసమాజాన్ని నిర్మిస్తామని మావోయిస్టులు నినదించారు.
రాయగడ జిల్లాలో మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించు కుని కాశీపూర్, కల్యాణసింగుపురం, బిసంకటక్, మునిగుడ, చంద్రపుర్ సమితుల్లోని మారుమూల గ్రామాల్లో ఈ మూడు రోజులుగా అనేక సభలు జరిగాయి ప్రతి గ్రామంలో వందలాది మంది ప్రజలు సభలకు ముందు ర్యాలీలు నిర్వహించారు.

Nessun commento:
Posta un commento