giovedì 9 maggio 2019

pc 9 maggio - India - Libertà per i compagni arrestati e perseguitati - siamo tutti 'naxaliti urbani' - ICSPWI info: csgpindia@gmail.com

రాజ్యమా తప్పదు మరి. చరిత్రలో ఏలిక ఎవరైనా ప్రజల ముందు తల వంచవలసిందే. ఇవ్వాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అదే జరిగింది. విరసం నిర్వహించాలనుకున్న మూడురోజుల ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే, దానిని నిరసిస్తూ ఇవ్వాల అక్షరాల 137 మందితో ఎస్ వి కే లో సభ జరిగింది. ఈ సభలో కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విప్లవ పార్టీలు, ప్రజా సంఘాల నాయకత్వం పాల్గొని ఈ పోరాటానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ప్రొ సాయిబాబా, విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు విడుదల కోసం విరసం నిర్వహించిన ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రెండు గంటలకు ముగిసింది. ధర్నాకు అనుమతి నిరాకరించి నిరసనను అడ్డుకోవాలన్న రాజ్యం పన్నాగం పటాపంచలైంది. నిర్బంధం ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యమం అలలాగా ఎగిసి పడుతుందని మరోసారి రుజువయ్యింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించి రాజ్య స్వభావాన్ని ఎండగట్టారు. దేశంలో నిరసన గొంతులకు అవకాశం లేకుండా బ్రాహ్మణ ఫాసిజం నాలుగు పడగల హైందవ నాగరాజు వేయిపడగలతో బుస కొడుతున్నది. ఈ క్రమంలోనే నిరసన గొంతులకు అవకాశం లేకుండా పోతుందని వక్తలందరూ అభిప్రాయపడ్డారు.

ప్రజా కళా మండలి కళాకారుల పాటతో ప్రారంభమైన కార్యక్రమం విరసం కార్యవర్గ సభ్యుడు
కాశీo మాట్లాడుతూ పోలీసులు ధర్నాకు అనుమతి ఇవ్వక పోగా, ఎన్నో రకాల ఇబ్బందులు సృష్టించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి విమల, బజరా, ఆర్.కె, డాక్టర్ సమున్నత(ఓయూ), ప్రొ పద్మజా షా, ప్రజా కళా మండలి అధ్యక్షుడు జాన్, టిడిఎఫ్ కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చంద్రశేఖర్, s. వెంకటేశ్వర్ రావు, ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం, కుల నిర్మూలన పోరాట సమితి కార్యదర్శి అభినవ్, డాక్టర్ కొండా నాగేశ్వరరావు(ఓయూ), ప్రొఫెసర్ రత్నం, మద్దిలేటి, రాజేంద్ర బాబు, కోట శ్రీనివాస్, బద్రి, రాజమల్లు, అంజమ్మ, ప్రొ. లక్ష్మణ్, ఎన్ వేణుగోపాల్, వరవరరావు సహచరి హేమలత మొదలైన రచయితలు, బుద్ధి జీవులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపన్యసించారు.
ఇప్పటికే విరసం వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయాలని ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నిరసన సభలో పాల్గొన్న మిత్రులందరూ తమ అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విరసం వరవరరావు, సాయిబాబా మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి భేషరతుగా విడుదల చేయాలని, సాయిబాబాకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని, పంజాగుట్ట చౌరస్తాలో కూల్చివేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి అక్కడే నెలకొల్పాలని, ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగి 23 మంది విద్యార్థుల మరణానికి కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తీర్మానాలు చేసింది.
- కాశీం, విరసం కార్యవర్గ సభ్యులు
28-04-209

Nessun commento:

Posta un commento