mercoledì 25 settembre 2019

pc 25 settembre - Celebrato in India il 15° anniversario della fondazione del PCI (Maoista)

The Communist Party of India (Maoist) will celebrate its fifteenth year of foundation from September 21 to October 8, according to the leaflets allegedly published by the Central Committee of Telangana. The pamphlets appeared on the Wajedu-Venkatapuram road in the Mulugu district recently.
Claiming himself as the only working-class party in India, the party banned by the Modi government explains that he would continue to fight against the Brahmin fascist thugs and for the Revolution. 
The Communist Party of India (Maoist) was founded on September 21, 2004, after a process of union between the Maoist Communist Party and the Revolutionary Communist Party of India (Maoist), forming the Maoist Communist Party of India, organization which would later join the Communist Party of India (Marxist-Leninist) (People's War) to give rise to the PCI (M). The final union was announced on October 14, 2004. A Central Committee was created with the historic Indian communist Ganapati as Secretary General. Since then, the PCI (M) will lead the People's War of India and the one known as the Naxalite Revolution.
In the brochures, the PCI-m calls its members to celebrate the event with revolutionary spirit by organizing assemblies and seminars in towns, cities and universities.

పార్టీ స్వర్ణోత్సవాలను పల్లెపల్లెనా జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు

(సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్ళు అయిన సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కమిటీ
అధికార ప్రతినిధి అభయ్ మీడియాప్రకటన పూర్తి పాఠం)
విప్లవ పార్టీ స్వర్ణోత్సవాలను నూతనోత్సాహంతో జరుపుకుందాం
భారత నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమాన్నికాపాడుకుందాం, పటిష్టం చేసుకుందాం, విస్తరిస్తూ పురోగమిద్దాం
ప్రజలారా
భారత ప్రజాతంత్ర విప్లవోద్యమానికి సుదీర్ఘకాల చరిత్ర ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ తొలుత విదేశీ గడ్డపై 1921లోనే ఏర్పడినప్పటికీ అది దృఢమైన పునాదులపై బలపడలేదు. పర్యవసానంగా, 1925 డిశంబర్ 26నాడు మన దేశంలోని కాన్పూర్ లో మరో విడుత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం జరిగి అది నేటికీ వర్ధిల్లుతోంది. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన గత 94 సంవత్సరాలలో అది అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, గొప్ప విజయాలను సాధించి ఆ క్రమంలో పెక్కు ఓటములను ఎదుర్కొన్నప్పటికీ దేశ పీడిత ప్రజల ఆదరాభిమానాలను ఎంతగానో చూరగొన్నది. అయునప్పటికీ దృడమైన సైద్ధాంతిక పునాదులపై పార్టీని బలోపేతం చేస్తూ సాయుధ విప్లవ మార్గంలో దానిని పురోగమింప చేయడంలో చోటు చేసుకున్న వైఫల్యాల నుండి భారత విప్లవ లక్ష్యంతో పార్టీ చీలిపోయీ తొలుత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) పేరుతో 1964లో మరో నూతన పార్టీ ఉనికిలోకి వచ్చింది. అదీ ఆశించిన విప్లవ పధాన్ని ఎంచుకొని ఆచరించని ఫలితంగానే అందులో నుండి సమస్త విప్లవ శక్తులు ʹవిప్లవ పార్టీ లేకుండా విప్లవమే లేదుʹ అన్న లెనినిస్టు బోధనల వెలుగులో నక్సల్బరీ, కాంక్షా-సోనార్ పూర్ ల‌ సాయుధ రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించి కొత్త పంథాలపై సరికొత్త విప్లవ పార్టీలను నిర్మించుకున్నాయి. 1969 ఏప్రిల్ 22 కామ్రేడ్ లెనిన్ శత జయంతి రోజు ఒకవైపు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు), అదే సంవత్సరం మరోవైపు అక్టోబర్ 22నాడు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (యం.సీ.సీ)లు ఏర్పడినాయి. దేశంలో ఆ రెండు విప్లవ పార్టీలు ఏర్పడి 50 యేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ రెండు విప్లవ స్రవంతుల స్వర్ణోత్సవాలనూ వాటి కొనసాగింపుగా 2004 సెప్టెంబర్ 21నాడు ఆవిర్భవించిన మహా విప్లవ స్రవంతి భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 15వ వార్షికోత్సవాన్నీ విప్లవోత్సాహం, అచంచల బోల్షివిక్ దీక్షా పట్టుదలలతో నవంబర్ 7వరకూ పాటిద్దాం. మధ్యలో 70యేళ్ల చైనా విప్లవ విజయ వార్షికోత్సవాలనూ, 102వ రష్యా విప్లవ విజయ వేడుకలను జరుపుకుందాం.
భారత విప్లవోద్యమ సుదీర్ఘకాల పురోగమనంలో తమ నులివెచ్చని నెత్తుర్లను ధారపోసిన వేనవేల వీరులను ముందుగా పేరు పేరునా స్మరించుకొని వారందరికీ విప్ప జోహార్లర్పిద్దాం. వారి గొప్ప పోరాటాలూ ఆదర్శాలూ అసమాన త్యాగాలూ లేకుండా నేటి విప్లవ పార్టీ విప్లవోద్యమం లేనే లేదు. గత ఐదు దశాబ్దాల విప్లవోద్యమ కాలంలో మన పార్టీ సంస్థాపక నేతలూ కామేడ్స్ చారుమజుందార్, కన్నయ చటర్జీలు మొదలుకొని అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులూ వివిధ స్థాయిలలోని అన్ని పార్టీ కమిటీల సభ్యులూ కార్యకర్తలూ మన ప్రజా సాయుధ శక్తి-పీఎల్జీఏ- కమాండర్లూ వీర గెరిల్లాలూ విప్లవ ప్రజా నిర్మాణాల నాయకులూ కార్యకర్తలూ విప్లవ ప్రజలనేక మంది దాదాపు 16 వేలకు పైగా కామేడ్స్ శతృవుతో పోరాడుతూ ఆశయ సాధనలో అసువులు బాసారు. ఆ వీర యోధులందరికీ పార్టీ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా వినమ్రులమై శిరస్సు వంచి విప్లవ జోహార్లర్పిద్దాం. వారి ఆశయాల సాధనకై తుదివరకూ పోరాడుతామనీ శపధం చేద్దాం. ఈ వేడుకల సందర్భంగా సమస్త పార్టీ, విప్లవ నిర్మాణాల కార్యకర్తలకూ, పీఎల్జీ యోధులకూ, మన మధ్య లేనప్పటికీ శతృశిబిరంలో విప్లవోత్సాహంతో విప్లవ జుండానెగరేస్తూ ధైర్యంగా నిలిచిన పార్టీ నాయకులకూ కార్యకర్తలకూ కేంద్ర కమిటీ విప్లవాభివందనాలు తెలుపుతోంది.
సెప్టెంబర్ 21, మన పార్టీ కార్యకర్తలందరికీ, విప్లవ ప్రజలకూ ఎంతో ప్రియమైన రోజు. కామ్రేడ్ చారుమజుందార్ అమరత్వం తర్వాత ముక్క చెక్కలైన సీపీఐ (యం.ఎల్)లోని విప్లవ గ్రూపులు నిజాయితీతో చేసిన కృషి ఫలితంగా 2013నాటికి దేశంలోని ప్రధాన విప్లవ పార్టీలన్నీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా తిరిగి సమైక్యం కాగలిగాయి. వాటి నాయకత్వంలోని ప్రజాసైన్యాలూ సమైక్యమై పీఎల్జీఏ ఉనికిలోకి వచ్చింది. ఫలితంగా దేశంలో బలమైన విప్లవోద్యమం పెంపొందడంతో భారత దోపిడీ పాలక వర్గాలు బెంబేలుపడిపోయి తమ భద్రతకు ఏకైక అతిపెద్ద ప్రమాదకర శక్తిగా మన పార్టీని గుర్తించాయి. దానిని నిర్మూలించడమే తమ లక్ష్యంగా ప్రకటించుకొని స్వల్పకాల, దీర్ఘకాల సైనిక వ్యూహాలతో ఎడతెరిపి లేని దాడులనూ కెంపుయిన్ల రూపంలో కొనసాగిస్తోంది. కానీ అవేవీ అవి ఆశించిన ఫలితాలివ్వకపోవడంతో వర్తమాన దేశ పాలకులు కరుడు గట్టిన హిందుత్వ శక్తులూ గత మూడేళ్లుగా ʹసమాధాన్ʹ సైనిక వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా దేశంలో విప్లవోద్యమం గణనీయంగా తగ్గిపోయిందనీ అర్ధ సత్యాలతో, అసత్యాలతో కూడిన గణాంకాలనూ విడుదల చేయడం పరిపాటైంది. కుబేరుల చేతులలోని మీడియా వారి గణాంకాలకు మసాలాలు దట్టిస్తూ అవాకులూ చవాకులతో ప్రజలను నిరుత్సాహపరచడానికి పూనుకుంది.
కేంద్రంలోని హిందుత్వ శక్తులు దేశంలోని విప్లవోద్యమాన్ని సమాలంగా రూపుమాపాలనీ ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రపంచంలోని భారీ ఆర్థిక వ్యవస్థల సరసన శర వేగంగా చేరిపోవడానికి సంబరపడిపోతున్న వాటి అన్ని చర్యలకు దేశంలోని విప్లవోద్యమం ప్రధాన ఆటంకంగా ఉందనీ అవి కలవరపడిపోతున్నాయి. వాటి హిందుత్వ ఎజెండాను విప్లవ శక్తులునిరాఘాటంగా సాగనివ్వడం లేదనీ మండిపడుతున్నాయి. సామ్రాజ్యవాదుల, బడా బూర్జువా భూస్వామ్య వర్గాల ప్రయోజనాల కోసం అవి అంకితమై చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలన్నిటినీ విప్లవ శక్తులు బహిర్గతం చేయడం వారికి కునుకు పట్టనివ్వడం లేదు. వారి కపట దేశభక్తిని, వారు రెచ్చగొడుతున్న జాతీయోన్మాదాన్ని, మత విద్వేషాన్ని విప్లవ శక్తులు ప్రజలకు తేటతెల్లం చేయడం వారు భరించలేకపోతున్నారు. దేశంలో వాటి విప్లవ ప్రతీఘాతక బ్రాహ్మణవాద హిందుత్వ విధానాల అమలును అడ్డుకొంటుండడం సహించలేక పోతున్నారు. వారి పీడిత దళిత, ఆదివాసీ, ముస్లిం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వాటికి వ్యతిరేకంగా దేశ పీడిత ప్రజలను సమైక్యం చేయడం వాటికి కంటగింపుగా తయారైంది. దేశంలోని ప్రజాస్వామిక, లౌకిక, ప్రగతిశీల శక్తులతో; అభ్యుదయ రచయితలు, కళాకారులతో ప్రజాహిత పాత్రికేయులతో, సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తులతో కలసి కార్మిక, కర్షక వర్గాల ప్రయోజనాల కోసం విప్లవ శక్తులు పాటుపడడం, దేశంలో విప్లవాన్ని కాంక్షించడమే భారత దోపిడీ పాలక వర్గాలకు లక్ష్యంగా మారింది.
దేశంలోని విప్లవోద్యమాన్నీ, విప్లవ పార్టీనీ, దాని సమస్త మిత్ర శక్తులను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి సామ్రాజ్యవాదుల సంపూర్ణ అండదండలు కలిగిన దేశ పాలకులు అడవులూ పల్లెలూ పట్టణాలూ మహానగరాలలో సైతం పోలీసు దాడులను ముమ్మరం చేశారు. పాలకులను ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి వారిని అరెస్టు చేయడం, జైలుపాలు చేయడమే కాకుండా అంతిమంగా వారిని భౌతికంగానూ నిర్మూలిస్తున్నారు. చట్టసభలలో బలాధిక్యత సంపాధించుకున్న ఆ దుష్ట నియంత శక్తులు వలసపాలకుల కాలంనాటి పాశవిక చట్టాలు సైతం దిగతుడుపు అయ్యేవిధంగా నిర్బంధ చట్టాలను సవరిస్తున్నారు. దేశాన్ని పోలీసు రాజ్యంగా మారుస్తూ ప్రజల రాజ్యాంగ హక్కులను హననం చేస్తున్నారు. విప్లవోద్యమ ప్రాంతాలలో లక్షలాది భద్రతా బలగాలను మోహరించి ముమ్మర గాలింపు చర్యలతో విప్లవకారులను మట్టుబెట్టడానికి భారీ సైనిక దాడులను కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యలో విప్లవకారులను హత్య చేస్తున్నారు. విప్లవ ప్రజలను హింసిస్తున్నారు. విప్లవోద్యమాన్ని త్వరలోనే రూపుమాపుతామనీ సంబరపడుతున్నారు. కాని అది ఎన్నటికీ వారికి సాధ్యం కాదన్నది నక్సల్బరీ నుండి నేటి వరకూ పదే పదే రుజువవుతూ వస్తున్నది. ఏ దేశ విప్లవోద్యమ చరిత్రలోనైనా ఆటు-పోట్లు అతి సహజం. వాటి నుండి విప్లవోద్యమం అనివార్యంగా తేరుకొని పురోగమించితీరుతుంది.
దేశంలో విప్లవ పార్టీని మట్టుబెట్టాలనే శతృ పథకాలను ఓడిస్తూ మన పార్టీ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా పార్టీని పటిష్టం చేసే ʹపార్టీ కన్సాలిడేషన్ʹ కేంపెయిన్ ను చేపట్టాలనీ కేంద్ర కమిటీ పార్టీకమిటీలకు పిలుపునిస్తోంది. పార్టీ కన్సాలిడేషన్ కేంపెయిన్ సందర్భంగా ఎక్కడికక్కడే నిర్ధిష్ట పరిస్థితులపై ఆధారపడి అన్ని స్థాయిల పార్టీ కమిటీలు నిర్ధిష్ట లక్ష్యాలను నిర్ణయించుకొని పూర్తిగా సఫలం చేయాలి. మన ఈ కేంపెయిన్ ను విఫలం చేయడానికి రాజ్యం, దాని అండతో విప్లవ ప్రతీఘాతక శక్తులు అన్ని రకాల దాడులను ముమ్మరం చేస్తారు. అయినప్పటికీ వాటి దాడులను వమ్ము చేస్తూ అపార ప్రజా సంఘటిత శక్తిని ఆయుధంగా మలచుకొని అనుకున్న లక్ష్యాలను బోల్షివిక్ పట్టుదలతో సాధించాలి. శతృవుకు అభేధ్యమైన విప్లవ పార్టీని నిర్మించాలి. ఆ విజయాలపై ఆధారపడి విప్లవోద్యమ విస్తరణకు పూనుకోవాలి. మన ప్రజాసైనిక నిర్మాణాలను పటిష్టం చేసుకుంటూ విస్తరించాలి. విప్లవ ప్రజా నిర్మాణాలను సంఘటితం చేసుకుంటూ విప్లవోద్యమ పటీష్టీకరణకు బలమైన పునాదులను ఏర్పర్చుకోవాలి.
బలమైన విప్లవ పార్టీ చేతిలో బలమైన ప్రజాసైన్యాన్నీ సమస్త విప్లవ శక్తులతో కూడిన బలమైన విప్లవ ఐక్యసంఘటనను అద్భుతమైన విప్లవ ఆయుధాలుగా మలచుకోవడం ద్వారానే అచంచల విశ్వాసంతో భారత విప్లవోద్యమాన్నీ విజయపథాన పురోగమింపచేయగలం.
ఈనాడు మన దేశ పీడిత ప్రజలకు బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు శక్తులే ప్రధాన ప్రమాదకర శక్తులుగా నిలిచాయి. అవి ప్రజలలో మత ప్రాతిపదికన చీలికలను సృష్టిస్తున్నవి. అనేక మతాలకు, జాతులకు, తెగలకు, భాషలకు, సంస్కృతులకు నిలయమైన మన ప్రియమైన భారతదేశాన్నీ ʹఏక్ భారత్-శ్రేష్టభారత్ʹ అంటూ ʹగాయి-గంగా-గీతాʹ అంటూ ʹహిందూ-హిందీ-హిందుస్తాన్ʹ అంటూ దేశ వివిధతను ధ్వంసం చేయపూనుకున్నారు. భారతదేశ చరిత్రను వక్రీకరిస్తున్నారు. ʹఅఖండ భారత్ʹ పేరుతో దేశ సరిహద్దులను విస్తరించబూనుకున్నారు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం పేరుతో ప్రజలను అనేక భ్రమలలో ముంచుతూ కుబేరుల ప్రయోజనాలు నెరవేరుస్తున్నారు. వారు ʹనయా భారత్ʹ నినాదాన్ని ముందుకు తెచ్చారు. దాన్ని సాధించుకోవడానికే వారు తమ చేతికి చిక్కిన దేశ పాలనను వినియోగిస్తున్నారు. ఆ ముప్పు నుండి ప్రజలను బయటకు తేవడమే నేటి తక్షణ కర్తవ్యంగా నిలిచింది. అందుకు తగిన విధంగా మన పార్టీని, విప్లవ శక్తులను, విప్లవ మితృలను మలచుకుందాం. ఆ ఫాసిస్టు శక్తులను ఓడించకుండా దేశంలో నూతన భారత ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేయలేం. శతృవు ఎంతటి బలసంపన్నుడైనప్పటికీ అంతిమంగా ప్రజలే జయిస్తారు. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న చారిత్రిక సత్యం రుజువవుతుంది. చరిత్రలో హిట్లరునూ, ముసోలినీని, జపాన్ సామ్రాజ్యవాదులను మట్టి కరిపించినది బోల్షివిక్కులు, మావోయిస్టులేనన్న వాస్తవం మన దేశంలోనూ పునరావృతం కాక తప్పదు.
*మన పార్టీ స్వర్ణోత్సవాలను గ్రామ గ్రామాన విప్లవోత్సాహంతో జరుపుకోవాలి.
*దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ యునిట్లు పార్టీ స్వర్ణోత్సవ వేడుకలను ప్రజలతో పంచుకోవాలి.
*మన విప్లవ పార్టీల సుదీర్ఘ అనుభవాలను నేటి తరాలకు అందించాలి. శతృవుకు అభేధ్యమైన విప్లవ పార్టీని నిర్మించండి.
*భారత విప్లవోద్యమం విజయపథాన వురోగమించి తీరుతుందన్న విశ్వాసాన్ని ప్రజలలో చాటండి.
*దోపిడీ పాలకవర్గాల కుట్రలను, వారి విప్లవ ప్రతీఘాతుక న్యూ ఇండియాను ప్రజలలో బట్టబయలు చేయాలి.
అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).
Keywords : cpi maoist party, new democratic revolution, abhay
(2019-09-24 20:02:19)

Nessun commento:

Posta un commento